- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లపై కొరడా
హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లు వాడే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ANPR కెమెరాల నిఘాతో 30 మంది వాహనదారులపై క్రిమినల్ కేసులు పెట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ-చలాన్ల నుంచి తప్పించుకుంటున్న వాహనదారులపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నకిలీ నంబర్ ప్లేట్లతో లేదా నంబర్లను మార్ఫింగ్ (ట్యాంపరింగ్) చేసి రోడ్డెక్కుతున్న వారి ఆటలకు బ్రేక్ వేస్తున్నారు. చలాన్ల భయంతో కొందరు, నేరాల గుర్తింపును దాచేందుకు మరికొందరు నకిలీ నంబర్లను అమర్చుకుంటున్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో పక్కాగా గుర్తింపు
నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, జాతీయ రహదారులు, వాణిజ్య కేంద్రాల వద్ద ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించారు. నగరవ్యాప్తంగా ఉన్న సీసీటీవీ కెమెరాలు, ముఖ్యంగా ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైషన్- ఏఎన్‌పీఆర్) కెమెరాల ద్వారా అనుమానాస్పద వాహనాల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ఇటీవలే నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ కవచ్‌లో సైతం ఇలాంటి ఎన్నో వాహనాలను గుర్తించి, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లలో మార్పులు చేస్తే, వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 318(4) మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 192 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
30 మందిపై కేసులు
ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, అక్షరాల మార్పు చట్టవిరుద్ధం. ట్యాంపరింగ్ చేసి పోలీసుల కళ్లుగప్పొచ్చని భావించడం పొరపాటు. ఇలాంటి చర్యలకు పాల్పడిన 30 మంది వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఎవరైనా తమ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను మరొకరు దుర్వినియోగం చేస్తున్నట్లు (మీ వాహనం వెళ్లకుండానే మీకు నకిలీ చలాన్లు వస్తున్నట్లు) అనుమానం వస్తే.. https://echallan.tspolice.gov.in ఈ-మెయిల్: echallanhelp [email protected] వాట్సాప్ నంబర్: 8712661690కు ఫిర్యాదు చేయొచ్చు. - జాయింట్ సీపీ జోయల్ డేవిస్






