- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘భోగి’ కోసం భారీ క్లైమాక్స్.. 20 రోజుల మెగా షెడ్యూల్
ప్రస్తుతం ‘భోగి’ చిత్ర క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ అనే పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా కనిపించనుండగా, కేకే రాధా మోహన్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. దాదాపు 20 రోజుల పాటు సాగనున్న ఈ మెగా షెడ్యూల్‌లో శర్వానంద్ పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్‌తో పాటు భావోద్వేగాలను మేళవిస్తూ క్లైమాక్స్‌ను దర్శకుడు సంపత్ నంది డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.






