అర్ధరాత్రి ఆపదలో అండగా యువ నాయకులు.. చెట్టు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణ

by Jakkula.Mamatha |

అర్ధరాత్రి వేళ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో ఓ డీసీఎం వాహనం చిక్కుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అర్ధరాత్రి ఆపదలో అండగా యువ నాయకులు.. చెట్టు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణ
X

దిశ, కొడిమ్యాల: అర్ధరాత్రి వేళ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో ఓ డీసీఎం వాహనం చిక్కుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదకర పరిస్థితిని గమనించిన స్థానిక కాంగ్రెస్ యువ నాయకులు అనుమాండ్ల అజయ్ రెడ్డి వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే జేసీబీని సంఘటనా స్థలానికి తెప్పించి, దాని సహాయంతో రహదారిపై పడిన భారీ చెట్టును తొలగించారు. దీంతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలోనూ ప్రజల భద్రత కోసం తక్షణమే స్పందించి సేవా భావాన్ని చాటిన యువ నాయకుల చర్యలను స్థానికులు అభినందించారు. వారి చొరవతో పెద్ద ప్రమాదం తప్పడంతో పాటు రహదారిపై సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కుంట రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు కవ్వం మధు పాల్గొన్నారు.

Next Story