- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈదురు గాలులకు రేకుల ఇంటి పై పడ్డ తాటి చెట్టు.. వృద్ధురాలు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు!
అర్ధరాత్రి ఈదురు గాలులకు ఒక తాటి చెట్టు రేకుల ఇంటి పై పడడంతో అందులో నివసిస్తున్న వృద్ధురాలు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, మీర్ పేట్: అర్ధరాత్రి ఈదురు గాలులకు ఒక తాటి చెట్టు రేకుల ఇంటి పై పడడంతో అందులో నివసిస్తున్న వృద్ధురాలు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సబ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం షాన్ పేట్‌కు చెందిన సబావత్ లక్ష్మి(75 ), సబావత్ వెంకటేష్(32), లలిత (29) స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో రేకుల ఇంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం రాత్రి భారీ ఈదురు గాలులకు రేకుల ఇంటి పై తాటి చెట్టు పడడంతో ఇంట్లో నివసిస్తున్న ఒక వృద్ధురాలు మృతి చెందడంతో పాటు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






