నాగార్జునసాగర్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, పలువురికి తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |

నాగార్జునసాగర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

నాగార్జునసాగర్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, పలువురికి తీవ్ర గాయాలు
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పైలాన్ కాలనీలోని పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ సమాధుల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ప్రభుత్వ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, మృతురాలి గుర్తింపు, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story