- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు .. ప్రముఖ విమానం టార్గెట్‌గా ఫోన్
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నుండి శంషాబాద్ వస్తోన్న ప్రముఖ లుఫ్తాన్స అనే విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నుండి శంషాబాద్ వస్తోన్న ప్రముఖ లుఫ్తాన్స అనే విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ పంపారు. విమానంలో మానవరహిత బాంబు ఉందని, అది ఏ క్షణం అయినా ల్యాండ్ అయ్యేలోపు పేలిపోతుంది అంటూ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో భత్రతా సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.
అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఎయిర్ పోర్ట్‌కు బెదిరింపు మెయిల్స్, కాల్స్ వచ్చాయి. ఇలాంటి బెదిరింపు కాల్స్ లో చాలా వరకు ఆకతాయిలు పంపినవే ఉన్నాయి. అయితే బెదిరింపులు వచ్చిన వెంటనే సిబ్బంది, అధికారులు మాత్రం అప్రమత్తమై వెంటనే తనిఖీలు నిర్వహిస్తారు. ఏం లేదని తేలితే ఊపిరిపీల్చుకుంటారు. ఆ తరవాత బెదిరింపు కాల్స్ చేసిన వారి వివరాలు రాబట్టి కేసు నమోదు చేస్తారు.






