- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికసిత్ భారత్ దిశగా మరో అడుగు.. అమెరికాతో 500 బిలియన్ డాలర్ల వ్యాపార ఒప్పందం
2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యంగా.. అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది. రాబోయే ఐదేళ్లలో అమెరికా నుండి కనీసం 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 42 లక్షల కోట్లు) విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ (Trade deal) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ చర్చ ముగియకముందే 2047 నాటికి 'వికసిత భారత్' ('Developed India') లక్ష్యంగా.. అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది. రాబోయే ఐదేళ్లలో అమెరికా నుండి కనీసం 500 బిలియన్ డాలర్ల (500 billion dollars) (రూ. 42 లక్షల కోట్లు) విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Union Commerce Minister Piyush Goyal) ఈ రోజు వెల్లడించారు. ముఖ్యంగా ఇంధనం, డేటా సెంటర్ పరికరాలు, విమానయాన రంగంలో భారత్ అవసరాలు భారీగా ఉన్నాయని, విమానాల కోసమే దాదాపు 70-80 బిలియన్ డాలర్ల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశ ప్రక్రియ (first step is the process) దాదాపు పూర్తయిందని ఈ సందర్భంగా మంత్రి ఈరోజు ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో తెలిపారు. వచ్చే 4-5 రోజుల్లోనే ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన (Joint Statement) చేసే అవకాశం ఉందని, మార్చి మధ్య నాటికి అధికారిక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ ఉమ్మడి ప్రకటన వెలువడిన వెంటనే, అమెరికా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా భారత్ నుండి వచ్చే వస్తువులపై టారిఫ్‌లను (సుంకాలు) 18 శాతానికి తగ్గించనుందని ఆయన వివరించారు.
అలాగే భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ (Indian Commerce Secretary Rajesh Agarwal) ఈ ఒప్పందంలోని సాంకేతిక అంశాలను వివరిస్తూ, ఈ చట్టపరమైన ఒప్పందం మార్చి నుంచి అమల్లోకి వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అమెరికాలో టారిఫ్ తగ్గింపులు (Tariff reductions') 'ఎగ్జిక్యూటివ్ టారిఫ్'ల ద్వారా జరుగుతాయని, భారత్‌లో మాత్రం 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' (MFN) టారిఫ్ విధానం ఉన్నందున, చట్టపరమైన ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాతే మన దగ్గర సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని రాజేష్ అగర్వాల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






