- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ ఎక్కడి నుంచైనా చమురు కొనుగోలు చేయవచ్చు.. రష్యా కీలక స్పందన
భారతదేశం తన చమురు అవసరాల కోసం ఏ దేశం నుంచి అయినా ముడి చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛను కలిగి ఉందని రష్యా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ మేరకు స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్, అమెరికా మధ్య నిర్ణయాత్మకమైన ట్రేడ్ డీల్ జరగడం కీలక పరిణామం గా మారిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అయితే ఒప్పందం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశం తన చమురు అవసరాల కోసం ఏ దేశం నుంచి అయినా ముడి చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛను కలిగి ఉందని రష్యా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ మేరకు స్పందించారు.
రష్యాతో చమురు కొనుగోళ్లను నిలిపివేసి, అమెరికా, వెనిజులా నుంచి చమురును కొనుగోలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారని, తద్వారా భారత్‌పై సుంకాలను తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి సహాయపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, "భారత్ తన చమురు సరఫరాదారులను వైవిధ్య పరచుకోవడం (Diversification) లో మాకు కొత్తేమీ కనిపించడం లేదు" అని పెస్కోవ్ అన్నారు. "భారత్‌కు రష్యా మాత్రమే ఏకైక చమురు సరఫరాదారు కాదని ప్రపంచ ఇంధన నిపుణులందరికీ తెలుసు. భారత్ ఎప్పుడూ వివిధ దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటుంది, కాబట్టి ఇందులో వింతేమీ లేదు" అని ఆయన వివరించారు.
రష్యా చమురు నిలిపివేతపై లేని అధికారిక ప్రకటన
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేస్తున్నట్లు భారత్ నుంచి తమకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని క్రెమ్లిన్ తెలిపింది. ట్రంప్‌తో ఫోన్ సంభాషణ తర్వాత సుంకాల తగ్గింపును స్వాగతించిన ప్రధాని మోడీ, రష్యా చమురు నిలిపివేతపై ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం భారత్ తన అవసరాలలో దాదాపు 27% చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూనే, మరోవైపు రష్యాతో తన వ్యూహాత్మక సంబంధాలను బ్యాలెన్స్ చేయడంలో భారత్ తన స్వయంప్రతిపత్తిని చాటుకుంటోందని, ఇందులో భారత్ తన సొంత ఆలోచనతో ట్రంప్ ను ఒప్పించుకుందని, ఇది కేవలం ప్రధాని మోడీకే సాధ్యమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






