- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు 'తేజస్ మార్క్ 1A' విమానాలు సిద్ధం.. పంపిణీపై HAL స్పష్టత
భారత వైమానిక దళం (IAF) హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఐదు 'తేజస్ మార్క్ 1A' విమానాలు సిద్ధం అయినట్లు ప్రకటన విడుదలైంది.

దిశ, వెబ్ డెస్క్: భారత వైమానిక దళం (IAF) హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఐదు 'తేజస్ మార్క్ 1A' విమానాలు ('Tejas Mark 1A' aircraft) సిద్ధం అయినట్లు ప్రకటన విడుదలైంది. IAF ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వదేశీ యుద్ధ విమానాల పంపిణీపై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కీలక ప్రకటన చేసింది. మార్కెట్‌లో, సోషల్ మీడియాలో డెలివరీ ఆలస్యంపై వస్తున్న వార్తలపై స్పందించిన సంస్థ, ప్రస్తుత స్థితిగతులను అధికారికంగా వెల్లడించింది.
పంపిణీకి సిద్ధంగా ఉన్న ఐదు విమానాలు
ఈ రోజు హెచ్‌ఏఎల్ (HAL) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం ఐదు తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం.. అన్ని రకాల సాంకేతిక సామర్థ్యాలు, స్పెసిఫికేషన్లను ఈ విమానాల్లో పొందుపరిచినట్లు సంస్థ స్పష్టం చేసింది. వీటిని భారత వైమానిక దళానికి అప్పగించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఇవి వాయుసేన అమ్ములపొదిలోకి చేరనున్నాయని హెచ్‌ఏఎల్ తెలిపింది.
ఇంజిన్ల సరఫరాలో అడ్డంకులు..
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టులో ఇంజిన్ల సరఫరాపై ప్రధాన అడ్డంకిగా మారిందని అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కూడా HAL స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే తొమ్మిది విమానాల తయారీ పూర్తయిందని, అవి పరీక్షా నియమాలను (Flying tests) కూడా పూర్తి చేసుకున్నాయని పేర్కొంది. అయితే, వీటికి అమర్చాల్సిన GE (జనరల్ ఎలక్ట్రిక్) ఇంజిన్ల కోసం వేచి చూస్తున్నట్లు HAL స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన జిఈ సంస్థ నుండి ఇప్పటివరకు ఐదు ఇంజిన్లు అందినట్లు సమాచారం. మిగిలిన ఇంజిన్లు అందిన వెంటనే ఆ తొమ్మిది విమానాలను కూడా పంపిణీకి సిద్ధం చేస్తామని సంస్థ హామీ ఇచ్చింది.
డిజైన్ సవాళ్లు, వాయుసేనతో చర్చలు
ఒప్పందంలో భాగంగా.. తేజస్ మార్క్ 1A తయారీలో ఎదురైన కొన్ని డిజైన్, డెవలప్‌మెంట్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన (Expedited manner) పరిష్కరిస్తున్నట్లు HAL ప్రకటించింది. ఈ విషయంలో భారత వైమానిక దళం తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, విమానాల అప్పగింతను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని సంస్థ పేర్కొంది. అమెరికన్ వెండర్ జిఈ నుండి ఇంజిన్ల సరఫరాపై సానుకూల ధోరణి ఉందని, భవిష్యత్తులో డెలివరీ ప్రణాళికలు సజావుగా సాగుతాయని ధీమా వ్యక్తం చేసింది.
లక్ష్యాల సాధనపై భరోసా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial Year) చివరి నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను (Guidance) ఖచ్చితంగా చేరుకుంటామని HAL తన వాటాదారులకు, భారత ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. వాయుసేన మొత్తం 180 తేజస్ మార్క్ 1A విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వగా, పంపిణీ వేగాన్ని పెంచేందుకు నాసిక్, బెంగళూరులో కొత్త ప్రొడక్షన్ లైన్లను కూడా ప్రారంభించారు. మొత్తానికి, ఇంజిన్ల కొరత వల్ల కొంత ఆలస్యం జరిగినప్పటికీ, అత్యాధునిక ఏసా (AESA) రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లతో కూడిన ఈ విమానాలు భారత గగనతల రక్షణను మరింత పటిష్టం చేయనున్నాయి.






