- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లోని ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ మినహాయింపు భారీగా పెంపు
హైదరాబాద్ లోని ఉద్యోగుల HRA పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆదాయపు చట్టంతో ఉద్యోగుల ఆర్థిక స్థితిగతుల్లో కీలక మార్పులు తీసుకురాబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలను మెట్రో నగరాల జాబితాలోకి చేర్చడం వల్ల ఆయా ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది సాఫ్ట్‌వేర్, ఇతర రంగాల ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. గతంలో కేవలం ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నైలను మాత్రమే మెట్రోలుగా పరిగణించి, అక్కడ ఉండేవారికి ఇంటి అద్దె భత్యం (HRA) మినహాయింపును 50 శాతంగా ఇచ్చేవారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఈ జాబితాలోకి చేరడంతో, ఇక్కడి ఉద్యోగులు తమ ప్రాథమిక జీతం (Basic Salary + DA)లో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ కింద పన్ను మినహాయింపు పొందేందుకు అర్హత సాధించారు. ఇది పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) అనుసరించే వారికి నెట్ ట్యాక్స్‌బుల్ ఇన్‌కమ్‌ను గణనీయంగా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఏప్రిల్ 1 నుండి అమల్లోకి
ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై ఇవి వర్తిస్తాయి. దీని ప్రభావం 2027 జూలైలో దాఖలు చేసే ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) సమయంలో ఇది వర్తిస్తుంది. అయితే ఈ 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు ప్రయోజనం కేవలం పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం 'కొత్త పన్ను విధానం' (New Tax Regime)లో ఇటువంటి మినహాయింపులకు అవకాశం లేదు. కాబట్టి, అధిక జీతం, ఎక్కువ ఇంటి అద్దె చెల్లిస్తున్న హైదరాబాద్ ఉద్యోగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి తమ ట్యాక్స్ ప్లానింగ్ మార్చుకోవడం ద్వారా వేల రూపాయల పన్నును ఆదా చేసుకునే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో గత ఐదేళ్లుగా ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. పాత నిబంధన ప్రకారం 40 శాతం పరిమితి ఉండటం వల్ల, ఉద్యోగులు తాము చెల్లిస్తున్న పూర్తి అద్దెకు మినహాయింపు పొందలేకపోయేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 50 శాతానికి పెంచడం వల్ల, ట్యాక్స్ సేవింగ్స్ పెరిగి చేతికి వచ్చే నికర ఆదాయం (Take-home salary) పెరుగుతుంది.






