ఐటీకి రూ.875 కోట్లు.. గ్రామాలకు హై-స్పీడ్ ఇంటర్‌నెట్

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-03-20 08:58:03  IST  )

తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ఐటీ శాఖకు భారీగా నిధులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.875 కోట్లను కేటాయించింది.

ఐటీకి రూ.875 కోట్లు.. గ్రామాలకు హై-స్పీడ్ ఇంటర్‌నెట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ఐటీ శాఖకు భారీగా నిధులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.875 కోట్లను కేటాయించింది. ఇప్పటికే టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని 424 మండలాల్లోని 8888 గ్రామపంచాయతీలకు, 4800 ప్రభుత్వ సంస్థలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అనుసంధానం చేసింది. ఈ ఆర్థిక సంవత్సంలో మరో 50 వేల ప్రభుత్వ సంస్థలకు కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ సంస్థల ఇంటర్నెట్‌ను సేవలను తగ్గించడంతోపాటు ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం టీ-ఫైబర్ ద్వారా సురక్షితమైన హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

ఐటీలో 9.39 లక్షల మందికి ఉద్యోగాలు:

ఐటీ రంగంలో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి దేశానికే తలమానిరంగా మారిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో 1500 కంటే ఎక్కువ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఐటీ రంగంలో వృద్ధి పెంచడానికి, పెట్టబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2, ఐసీటీ విధానాలను ప్రభుత్వం ప్రారంభించిందని మినిస్టర్ భట్టి వెల్లడించారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీలను ప్రభుత్వం తీసుకొస్తున్న చెప్పారు. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశీలు కల్పిస్తున్నాయని భట్టి వివరించారు.

జీసీసీలో హైదరాబాద్ వాటా 20 శాతం:

మొత్తం భారతదేశం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (Global Capability Centers)లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 70కి పైగా కొత్త GCCలు హైదరాబాద్2లో ఏర్పడ్డాయన్నారు. ప్రపంచ దిగ్గజ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీలో హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటన్‌ను ఏర్పాడు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికి పరిమితం కాకుండా నగరం చుట్టూ ఐటీని విస్తరించడానికి ‘గ్రిడ్’ (Growth In Dispersion) విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భట్టి చెప్పారు.

హైదరాబాద్‌లోని ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ మినహాయింపు భారీగా పెంపు

Next Story