- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తలైవార్-176’ కోసం ఇద్దరు భామలు.. ఆ డిజాస్టర్ హీరోయిన్ వద్దంటున్న నెటిజన్లు
తలైవార్-176 కోసం పూజా హెగ్డే, ప్రియాంక అరుళ్ మోహన్.

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), ఉలగనాయగన్ కమల్ హాసన్(Kamal Haasan) చాలాకాలం తర్వాత మళ్ళీ చేతులు కలుపుతుండటంతో ‘తలైవార్ 176’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో కొత్త వార్తలు నెట్టింట హల్చల్ చేస్తూ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు పూజా హెగ్డే, ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) కీలక పాత్రలు పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు తోడు ఈ ఇద్దరు గ్లామరస్ భామల ఎంట్రీ ఉండటంతో కాంబో అదరిపోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే, పూజా హెగ్డే(Pooja Hegde) పేరు తెరపైకి రాగానే సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆమెకు ఇటీవల సరైన హిట్ లేకపోవడంతో, కొందరు నెటిజన్లు ఆమెను ‘ఐరన్ లెగ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. రజనీకాంత్ లాంటి పెద్ద సినిమాకు ఆమెను తీసుకోవద్దంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో రజనీకాంత్ చిత్రం ‘కూలీ’లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ.. ఆమె తీసుకోవద్దని అంటున్నారు. ఇక వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రియాంక ఎలాంటి పాత్రలో కనిపించబోతుందన్న ఆసక్తి నెలకొంది.
Read More..






