‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం రంగంలోకి క్రేజీ బ్యూటీ.. చరణ్ పక్కన సూట్ కాదంటూ ఫ్యాన్స్ రచ్చ

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-23 05:21:17  IST  )

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారని సమాచారం.

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం రంగంలోకి క్రేజీ బ్యూటీ.. చరణ్ పక్కన సూట్ కాదంటూ  ఫ్యాన్స్ రచ్చ
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రస్తుతం తన లైనప్‌లో ఉన్న చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో ఆయన చేస్తున్న ‘పెద్ది’(peddi) చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మునుపెన్నడూ చూడని ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి దిగ్గజాలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలోని స్పెషల్ మాస్ సాంగ్‌లో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)మెరవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ లాంటి గ్రేట్ డ్యాన్సర్‌తో మృణాల్ స్టెప్పులు వేయబోతుండటం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్పెషల్ అట్రాక్షన్ సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఆమెతో చర్చలు కూడా పూర్తి కాగా.. ఫైనల్ చేసే ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసిన నెటిజన్లు మృణాల్ హైట్ చరణ్ పక్కన సెట్ అవుతుందా లేదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, చరణ్ గ్రేస్ అండ్ మృణాల్ గ్లామర్ కలిస్తే స్క్రీన్ అదిరిపోతుందని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మార్చి 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ స్పెషల్ సాంగ్ పై వస్తున్న పుకార్లపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More..

పెద్ది ఫస్ట్ హాఫ్ ఫినిష్‌..బుచ్చిబాబు జోరు మాములుగా లేదు!

Next Story