- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు.. భారీ పేలుడు బాధితురాలికి అండ
మరోసారి గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్! వేట్లపాలెం పేలుడు బాధితురాలు, దివ్యాంగురాలు దుర్గకు నెలకు రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం ప్రకటన.

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ మరోసారి తన ఉదారతను చాటుకుంటుకున్నాడు. ఓ అనాథ బాలికకు అండగా నిలిచి బరోసా కలిపించాడు. ఇటీవల ఆంద్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో తండ్రిని కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న దుర్గ అనే మానసిక దివ్యాంగురాలి దీనగాథ అల్లు అర్జున్‌ను కదిలించింది. తండ్రి మరణంతో అనాథగా మిగిలిన ఆ బాలిక భవిష్యత్తుకు భరోసా కల్పించాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్, ఆమె సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాను 'హీరో' అని నిరూపించుకుంటూ, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే తన సంప్రదాయాన్ని ఆయన కొనసాగించారు.
ఈ మానవీయ కార్యక్రమంలో భాగంగా, దుర్గ నిత్యావసరాలు, పోషణ కోసం ప్రతి నెలా రూ. 7,500 చొప్పున ఆర్థిక సహాయాన్ని అల్లు అర్జున్ అందించనున్నారు. ఆయన ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేట్లపాలెం గ్రామానికి వెళ్లి దుర్గను స్వయంగా కలిసి, ఆమెకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆ బాలికకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక బాధ్యతతో స్పందించిన అల్లు అర్జున్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.






