- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ శంకర్ మ్యాజిక్ రిపీట్.. పవర్ స్టార్ పవర్‌ఫుల్ పోస్టర్‌తో పెరుగుతున్న అంచనాలు!
ఈ సినిమాలోని మూడో పాట ‘‘కోల్లార్ ఏయ్ ఏతరా’’ను రిలీజ్ చేసేందుకు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ టాలీవుడ్ రికార్డులను తిరగరాసి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో గ్లామర్ డాల్ శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. మార్చి 19న ఉగాది పండుగ కానుకగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు మూడో పాటతో ‘మ్యూజికల్ జర్నీ’ని మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.
ఈ సినిమాలోని మూడో పాట ‘‘కోల్లార్ ఏయ్ ఏతరా’’ను రిలీజ్ చేసేందుకు టైమ్ ఫిక్స్ చేశారు. నేడు (మార్చి 10) సాయంత్రం 4:36 గంటలకు ఈ పాట ప్రోమోను విడుదల చేయబోతున్నట్లు ఒక పవర్‌ఫుల్ మాస్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే, పూర్తి పాటను మాత్రం మార్చి 12న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ బీట్ థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. హరీష్ శంకర్ మ్యాజిక్ రిపీట్ చేయనున్నట్లు అర్థమవుతోంది. తాజాగా.. విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ మాస్ అవతార్ అదిరిపోయింది. తలకు ఎర్రటి క్లాత్ కట్టుకుని, ఊర మాస్ స్టెప్పులతో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది.
ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఈ సాయంత్రం నుండి, మీ కాలర్లను పైకెత్తి, మా పవర్‌స్టార్‌తో ఉత్సాహభరితమైన హుక్‌స్టెప్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మార్చి 12న హైదరాబాద్‌లోని అతిపెద్ద సింగిల్ స్క్రీన్‌లో భారీ ఈవెంట్‌తో పూర్తి పాటను విడుదల చేసి వేడుక జరుపుకుందాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కోసమే హరీష్ శంకర్ ప్రత్యేకంగా కొన్ని సీన్లను డిజైన్ చేశారని సమాచారం. ఈ సినిమాతో పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






