ఆ స్టార్ హీరో సినిమాలో చాన్స్ వచ్చినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా: రుక్మిణి వసంత్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-19 04:02:38  IST  )

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు.

ఆ స్టార్ హీరో సినిమాలో చాన్స్ వచ్చినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా: రుక్మిణి వసంత్
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు. అతి తక్కువ సమయంలోనే.. ఊహించని పాపులారిటీని దక్కించుకుంది. పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించగా.. ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ‘కాంతార: చాప్టర్ 1’(Kantara: Chapter 1)లో ఆమె చేసిన నెగటివ్ రోల్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత రుక్మిణి వసంత్‌కు కూడా అవకాశాలు భారీగా పెరిగాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలో హీరోయిన్ల పట్ల ఉండే కొన్ని ముందస్తు అంచనాలు తనను ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత ఒత్తిడికి గురిచేశాయో ఆమె వివరించారు. దర్శకుడు రిషబ్ శెట్టి నుంచి పిలుపు వచ్చినప్పుడు తాను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని, అయితే అది విలన్ పాత్ర అని తెలిశాక ఒక్కసారిగా షాక్ తిన్నానని ఒత్తిడికి గురయ్యా అని రుక్మిణి తెలిపారు. హీరోయిన్లు ఎప్పుడూ ఒకే తరహా జోన్‌లో ఉండాలని, సాఫ్ట్ క్యారెక్టర్లే చేయాలని బయట చాలామంది చెబుతుంటారు. అలాంటి సమయంలో విలన్ పాత్ర చేస్తే నా భవిష్యత్తు కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో అని చాలా భయపడ్డాను. ఆందోళనతో రాత్రులు నిద్రలేని గడిపాను అని ఆమె పేర్కొన్నారు.

కానీ, ఒక నటిగా తనను తాను నిరూపించుకోవాలంటే ఇలాంటి సవాళ్లను స్వీకరించక తప్పదని నిర్ణయించుకుని ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని రుక్మిణి తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక ఏడాది పాటు దాని గురించి పెద్దగా ఆలోచించకపోయినా, రిలీజ్ సమయం దగ్గరపడే కొద్దీ మళ్ళీ గుండెల్లో వణుకు మొదలైందని పేర్కొంది. అయితే, సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని, నటీమణులు కూడా వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేయగలరని జనం గుర్తించడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా తనను ఒక మెరుగైన నటిగా మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తిగా కూడా మార్చిందని రుక్మిణి పేర్కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More..

వైట్ శారీలో నాని హీరోయిన్.. నీ అందాన్ని పొగడటానికి డిక్షనరీలో ఉన్న వర్డ్స్ కూడా సరిపోవంటూ కామెంట్స్

Next Story