- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైట్ శారీలో నాని హీరోయిన్.. నీ అందాన్ని పొగడటానికి డిక్షనరీలో ఉన్న వర్డ్స్ కూడా సరిపోవంటూ కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘పెద్ద మనిషి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ‘నిన్ను కోరి’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జై లవకుశ’, ‘వకీల్ సాబ్’, ‘శాకిని డాకిని’ వంటి సినిమాలతో హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ ‘35 చిన్న కథ కాదు’ మూవీలో చాలా లావు అయి కనిపించింది.
అప్పట్లో స్లిమ్‌గా ఉండే ఈ చిన్నది ఒకేసారి లావు అయి కనిపించడంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రజెంట్ ఈ భామ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేనట్టు కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాకే పరిమితమైంది. అక్కడ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నివేదా తన సోషల్ మీడియాలో కొన్ని ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేసింది. అందులో తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబోసుకుని, పెద్ద ముక్కు పుడక పెట్టుకొని, వేళ్లకు పెద్ద పెద్ద రింగ్స్ పెట్టుకుంది. ఇక వీటికి.. ‘ఆ బంగారు శరీరం లాలన స్పర్శతో లాలించింది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నీ అందాన్ని పొగడటానికి డిక్షనరీలో ఉన్న వర్డ్స్ కూడా సరిపోవంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
Anasuya: మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతదేశం ఇదే.. దుమారం రేపుతున్న అనసూయ పోస్ట్






