- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anasuya: మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతదేశం ఇదే.. దుమారం రేపుతున్న అనసూయ పోస్ట్
గత కొద్ది రోజులుగా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)సోషల్ మీడియా వేదికగా వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతోంది.

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)సోషల్ మీడియా వేదికగా వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆమె చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అవుతూ, నెటిజన్ల మధ్య చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న విమర్శలు, దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై ఆమె గట్టిగా స్పందిస్తూ తన అభిప్రాయాలను ఎలాంటి భయం లేకుండా వెల్లడిస్తోంది. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల సామాన్లు, దుస్తులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర స్థాయిలో స్పందించడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మరింతగా ట్రెండ్ అయ్యింది. ఒకవైపు మద్దతు లభిస్తుండగా, మరోవైపు విమర్శలు కూడా భారీగా ఎదురయ్యాయి.
అయినప్పటికీ తన అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేదని అనసూయ స్పష్టం చేస్తూ వరుస పోస్టులు చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏకంగా 73 మంది వ్యక్తులపై ఫిర్యాదు చేసి అనసూయ అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మహిళలను టార్గెట్ చేసి చేసే వ్యాఖ్యలకు చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించింది. ఈ పరిణామం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ మరోసారి తన ట్వీట్‌తో సంచలనం సృష్టించింది. సింగర్ చిన్మయి(Chinmayi) చేసిన ఓ ట్వీట్‌కు ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘‘దాదాపు 40 మంది ఎంపీలు ప్రస్తుతం అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్నందున, అత్యాచార నేరస్తులకు మరణశిక్ష విధించే బిల్లుకు ఆమోదం లభించడం లేదు’’ అంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలకు అనసూయ ఘాటుగా స్పందించింది. ‘‘ఇదే మన భారతదేశం… మనం ఎన్నుకున్న నాయకులు నడిపే దేశం. మనం ఇంకా చాలా దూరం వెళ్లాలి. కానీ దురదృష్టవశాత్తు మన చర్చలు మాత్రం బట్టల దగ్గరే ఆగిపోయాయి’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళల భద్రత, న్యాయం వంటి కీలక అంశాలపై సమాజం ఎంత వెనుకబడి ఉందో ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనసూయ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ ట్వీట్‌ప చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read More..
పూజా హెగ్డేకు చేదు అనుభవం.. పాన్ ఇండియా హీరో క్యారవాన్‌లో అలా చేశాడంటూ షాకింగ్ కామెంట్స్!






