పూజా హెగ్డేకు చేదు అనుభవం.. పాన్ ఇండియా హీరో క్యారవాన్‌లో అలా చేశాడంటూ షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-19 03:59:22  IST  )

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ వెనక ఎన్నో కఠిన వాస్తవాలు దాగి ఉంటాయన్న విషయం తెలిసిందే.

పూజా హెగ్డేకు చేదు అనుభవం.. పాన్ ఇండియా హీరో క్యారవాన్‌లో అలా చేశాడంటూ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ వెనక ఎన్నో కఠిన వాస్తవాలు దాగి ఉంటాయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్లు తమ కెరీర్‌లోఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటుంటారు. కొందరు అవకాశాలు కోల్పోతామన్న భయంతో మౌనంగా ఉంటే, మరికొందరు మాత్రం అలాంటి ఘటనలకు గట్టిగా ఎదురు నిలుస్తున్నారు. అయితే ఈ విషయాలపై కొంతమంది ధైర్యంగా మాట్లాడుతుంటే, ఇంకొందరు వాటిని తమలోనే దాచుకొని కుమిలిపోతుంటారు. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ పలువురు నటీనటులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

అంతేకాదు, షూటింగ్ సెట్లలో ఎదురైన చేదు అనుభవాలను కొందరు బయటకు చెప్పడంతో ఇండస్ట్రీలోని నటుల ప్రవర్తనపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో..తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)కూడా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తాను ఓ భారీ పాన్-ఇండియన్ సినిమాలో పనిచేస్తున్న సమయంలో, తన అనుమతి లేకుండానే పాన్ ఇండియా హీరో తన క్యారవాన్‌లోకి ప్రవేశించాడని తెలిపింది. అది తనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించిందని, వ్యక్తిగత హద్దులు దాటినట్లుగా అనిపించిందని పూజా చెప్పుకొచ్చింది. అలాగే అతను తనను టచ్ చేయడానికి ప్రయత్నించాడని తెలిపింది. అలాంటి పరిస్థితిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేదని, వెంటనే స్పందిస్తూ అతడిని చెంపదెబ్బ కొట్టినట్లు పూజా హెగ్డే వెల్లడించింది.

ఆ సంఘటన తర్వాత ఆ నటుడు మళ్లీ తనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదని ఆమె పేర్కొంది. అయితే ఆ విషయం గురించి తనకు ఎలాంటి బాధ లేదని.. భద్రతే తనకు ముఖ్యం అని పూజా స్పష్టంగా చెప్పింది. ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఇతరుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సిన అవసరం ఉందని, అనుమతి లేకుండా ఎవరి వ్యక్తిగత స్థలంలోకి వెళ్లడం తప్పని పూజా హెగ్డే అభిప్రాయపడింది. ప్రస్తుతం పూజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది అభిమానులు, నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, మహిళలు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Read More..

అదంతా చూసి ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్

Next Story