- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదంతా చూసి ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పుష్ప–2’ (pushpa-2)సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పుష్ప–2’ (pushpa-2)సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దేశవిదేశాల్లో సంచలన రికార్డులు సృష్టించి, ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమా జపాన్‌లో జనవరి 16న విడుదలై అక్కడ కూడా మంచి స్పందనను రాబట్టింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక జపాన్‌లో సందడి చేశారు. అక్కడ గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నేను జపాన్‌లో కేవలం ఒక్కరోజే ఉన్నాను. కానీ ఆ ఒక్క రోజులోనే నాకు దక్కిన ప్రేమ మాటల్లో చెప్పలేనంత అద్భుతం. ఎంతోమంది ప్రేమతో ఉత్తరాలు, బహుమతులు ఇచ్చారు.
వాటన్నింటినీ చదివి, చూసి నా మనసు కదిలిపోయింది. మీ ప్రేమను చూశాక ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ బహుమతులన్నింటినీ నేను ఇంటికి తీసుకువచ్చాను. ఇంతటి ప్రేమకు జపాన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. మళ్లీ తిరిగి రావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈసారి మాత్రం ఎక్కువ రోజులు అక్కడే ఉండి సమయం గడపాలనుకుంటున్నాను. ఇది నా వాగ్దానం. తదుపరి ప్రయాణానికి ముందే మరింత జపనీస్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మీ అందరికీ పెద్ద కౌగిలింతలు’’ అని రాసుకొచ్చింది.
కాగా.. రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘మైసా’చిత్రంతో ప్రేక్షకులను అలరించనుంది. లేడీ ఓరియెంటెడ్ కథతో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాను రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిలిమ్స్ పతాకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికతో పాటు, ‘పుష్ప 2’లో విలన్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read More..
Anasuya: మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతదేశం ఇదే.. దుమారం రేపుతున్న అనసూయ పోస్ట్






