ఆ హీరోయిన్‌తో సినిమా చేసి ఇప్పటికీ బాధపడుతున్నానంటూ శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-17 04:31:32  IST  )

టాలీవుడ్‌లో అత్యధిక సక్సెస్ రేట్ కలిగిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఒకరు.

ఆ హీరోయిన్‌తో సినిమా చేసి ఇప్పటికీ బాధపడుతున్నానంటూ శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో అత్యధిక సక్సెస్ రేట్ కలిగిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఒకరు. హృదయాన్ని హత్తుకునే ఫీల్-గుడ్ సినిమాలతో, యువత, ఫ్యామిలీ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. ఆయన ఏ హీరోతో పని చేసినా, ప్రేక్షకులు ఆ సినిమా పట్ల పూర్తి నమ్మకంతో ఉంటారు. గుడ్డిగా థియేటర్‌కి వెళ్లి చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే శేఖర్ కమ్ముల కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇటీవల ‘కుబేర’తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించారు. ఈ విజయంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్ చేశారు.

“మీరు చేసిన సినిమాల్లో అసలు నచ్చని సినిమా ఏదైనా ఉందా?” అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. ‘అనామిక’ (Anamika)సినిమా నాకు అసలు నచ్చలేదు. ఏదో తేడా అనిపించింది. నయనతార వంటి బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌తో చేయాల్సిన మూవీ కాదనిపించింది. అనవసరంగా చేసానని ఇప్పటికీ బాధపడుతున్నాను” అని చెప్పారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నయనతార(Nayanthara) ఫ్యాన్స్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం “మొట్టమొదటి సినిమా కావడం వల్ల కొంత అసంతృప్తి ఉండడం సహజమే. శేఖర్ కమ్ముల కెరీర్ ప్రారంభంలో కొన్నిసార్లు అంచనాలకు సరిపోని ఫలితాలు రావడం సహజం” అని అంటున్నారు.

Read More..

వాళ్లు అలా అనేసరికి నా భార్య చాలా ఫీల్ అయింది.. వెంకటేష్ ఎమోషనల్ కామెంట్స్

Next Story