వాళ్లు అలా అనేసరికి నా భార్య చాలా ఫీల్ అయింది.. వెంకటేష్ ఎమోషనల్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-01-17 04:30:23  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌(Venkatesh)కు ఉన్న ఇమేజ్ మనందరికీ సుపరిచితమే.

వాళ్లు అలా అనేసరికి నా భార్య చాలా ఫీల్ అయింది.. వెంకటేష్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌(Venkatesh)కు ఉన్న ఇమేజ్ మనందరికీ సుపరిచితమే. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా.. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు'‌(Mana Shankara Varaprasad Gaaru)లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అదరగొట్టారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగా కూడా సినిమా రోజురోజుకీ కొత్త రికార్డులు నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది.

ఈ విజయం నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ వెంకీ గౌడ అనే రోల్‌లో కనిపిస్తాడు. దీంతో అప్పటి నుంచి వెంకీను సోషల్ మీడియాలో తన అభిమానులు 'వెంకీ గౌడ' అంటూ పిలుస్తున్నారు.

ఇక దీనిపై తాజాగా స్పందించిన వెంకటేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అందరూ నన్ను వెంకీ గౌడ అని పిలుస్తున్నారు. కానీ ఒకసారి ఎవరో మా ఆవిడను 'నీరజ గౌడ' అని పిలిచారట. పాపం ఆమెకు చాలా ఎంబారసింగ్‌గా అనిపించి బాగా ఫీలయ్యింది’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ట్వీట్ వైరల్

Next Story