- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Faria Abdullah: హిందూ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను..బిగ్ ట్విస్ట్ ఇస్తూ ఫరియా షాకింగ్ కామెంట్స్
‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu)సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ‘చిట్టి’ (ఫరియా అబ్దుల్లా)Faria Abdullah.

దిశ, సినిమా: ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu)సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ‘చిట్టి’ (ఫరియా అబ్దుల్లా)Faria Abdullah. ఇప్పుడు తన రియల్ లైఫ్ లవ్ స్టోరీని బయటపెట్టి అందరికీ షాకిచ్చింది. పొడవాటి విగ్రహం, ఆకర్షణీయమైన రూపంతోనే కాకుండా.. నటన, డ్యాన్స్, ర్యాప్ సింగింగ్‌తో మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న ఈ హైదరాబాదీ భామ తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాను ఒక హిందూ అబ్బాయితో డేటింగ్‌లో ఉన్నానని, ఆ వ్యక్తి సినీ పరిశ్రమకే చెందిన ఒక యంగ్ కొరియోగ్రాఫర్ అని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రొఫెషనల్ పార్టనర్‌షిప్ నుంచి ప్రేమ వరకు.. ఫరియా తన ప్రియుడి గురించి చెబుతూ.. తమ బంధం కేవలం ఒక సాధారణ ప్రేమ వ్యవహారం కాదని, అదొక గొప్ప ‘పార్టనర్‌షిప్’ అని పేర్కొంది.
“నేను ఈ మధ్య కాలంలో మ్యూజిక్, డ్యాన్స్, ర్యాప్ పాటల్లో ఇంతగా రాణిస్తున్నానంటే దానికి కారణం ఆయనే. కేవలం నటిగా మాత్రమే కాకుండా నాలోని ఇతర కళలను వెలికితీయడంలో ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. మేమిద్దరం ఒక టీమ్‌లా కలిసి వర్క్ చేస్తాం,” అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉంటూనే తన వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో తన ప్రియుడు అందించే సలహాలు తనకు ఎంతో కీలకమని ఆమె తెలిపింది. ముస్లిం మతానికి చెందిన ఫరియా, హిందూ అబ్బాయితో ప్రేమలో ఉండటంపై స్పందిస్తూ.. మతాల కంటే మానసిక అనుబంధమే ముఖ్యం. మా బంధాన్ని కేవలం ఒక అఫైర్‌గా నేను చూడను. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే జీవితకాల భాగస్వామ్యం,” అని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో ఆమె ప్రియుడైన ఆ కొరియోగ్రాఫర్ ఎవరనే ఆసక్తి ఇప్పుడు నెటిజన్లలో పెరిగిపోయింది.
Read More..






