తెలుగు, తమిళ హీరోయిన్లకు నటన రాదు.. దుమారం రేపుతున్న మాళవిక కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-22 03:23:11  IST  )

మలయాళ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘ది రాజాసాబ్’(The Rajasab) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, తమిళ హీరోయిన్లకు నటన రాదు.. దుమారం రేపుతున్న మాళవిక కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘ది రాజాసాబ్’(The Rajasab) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. తమిళంలో పలు హిట్స్ సాధించిన మాళవిక తెలుగులోనూ అదే రేంజ్‌లో గుర్తింపు రాబట్టుకోవాలని చూసింది. కానీ రాజాసాబ్ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, మాళవిక మోహనన్ హీరోయిన్లకు యాక్టింగ్ రాదని కేవలం.. ఒక పద్దదితో నెట్టుకొస్తారని చెప్పింది. తెలుగు, తమిళ హీరోయిన్స్‌కు దారుణంగా అవమానించింది.

‘‘చాలాకాలం నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న తెలుగు, తమిళ హీరోయిన్స్‌కు నటించడం రాదు. ముఖ్యంగా విషాద సన్నివేశాల్లో వారు లోపల (1,2,3,4) అని లెక్కించుకుంటూ కేవలం విచారకరమైన హావభావాలను ప్రదర్శిస్తారు. అలాగే హీరోపూ కోప్పడే సీన్స్‌లో లోపల (A,B,C,D) అని లెక్కించుకుంటూ నటిస్తారు. వారు కేవలం తమ పెదవులను కదలిస్తారు అంతే. దానికి తగ్గట్లు డబ్బింగ్‌లో దాన్ని సరిచేసుకుంటారు. కేవలం ఒక్క సినిమాకే కాదు, వారి కెరీర్ మొత్తం ఈ పద్ధతిలో నెట్టుకొస్తారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అలాంటిది ఆమెకు వాళ్ల యాక్టింగ్ ఎలా తెలుస్తుంది.. ఇలా అనడం తప్పు అని ట్రోల్ చేస్తున్నారు.

Read More..

ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను కానీ కించపరచాలని చేయలేదు.. దయచేసి క్షమించండి..

Next Story