- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను కానీ కించపరచాలని చేయలేదు.. దయచేసి క్షమించండి..
మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు బంగారంతో (బెల్లం)తో మొక్కులు చెల్లించుకునే అనవాయితీగా మారింది.

దిశ, సినిమా: మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు బంగారంతో (బెల్లం)తో మొక్కులు చెల్లించుకునే అనవాయితీగా మారింది. అయితే ప్రతి ఏడాది కొట్టి కోట్ల మంది తమ కోరికలు నెరవేరితే.. మొక్కులు చెల్లించుకుంటారు. ఇక టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య కూడా అదే పద్దతిని పాటించి వివాదంలో చిక్కుకుంది. తన పెంపుడు కుక్కను తక్కెడలో కూర్చోబెట్టిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్త వివాదాస్పదమైంది. దీంతో కొందరు ఆమెపై విమర్థలు చేశారు. అలా చేయడం దేవతలను అవమానించడమే అని ట్రోల్ చేశారు. తాజాగా, ఈ విషయంపై టీనా శ్రావ్య (Tina Shravya)స్పందించి క్షమాపణలు కోరింది. ‘‘నేను ఈ వీడియోతో క్లారిటీ ఇవ్వడానికి, అలాగే క్షమాపణ చెప్పడానికి చేస్తున్నాను.
మేము పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాకే తెలిసింది. మేము పెంచుకునే కుక్కకి 12 ఏళ్లు.. దానికి ట్యూమర్ సర్జరీ జరిగింది. అది రికవరీ అవ్వాలని నేను అమ్మవారికి మొక్కుకున్నాను. రికవరీ అయింది.. నడుస్తోంది. అందుకే మొక్కు చెల్లించాలని మా డాగ్‌కి బంగారం తూకం వేయడం జరిగింది. కాబట్టి నేను అది ప్రేమతొ, భక్తితో మాత్రమే చేశాను.. కానీ వేరే ఉద్దేశంతో కాదు అలాగే ఎవరిని కించపరచాలని కూడా చేయలేదు. మన మేడారం జాత్ర సంప్రదాయం ప్రకారం.. గిరిజనుల ఆచారం ప్రకారం తప్పని నాకు ఇప్పుడే అర్థమైంది. కాబట్టి నేను చేసిన తప్పు వల్ల ఎవరైనా బాధపడిఉంటే నన్ను క్షమించండి. అలాగే ఇలాంటి పొరపాటు మళ్లీ జరగదు.. అలాంటి తప్పు మళ్లీ చేయను. మన సంప్రదాయాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను’’ అని వీడియో రిలీజ్ చేసింది. దీంతో వివాదానికి చెక్ పడినట్లు అయింది.
Read More..






