భారత్‌కు భారీ షాక్.. 500 శాతం టారిఫ్‌లు విధించే యోచనలో ట్రంప్?

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 05:49:15  IST  )

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

భారత్‌కు భారీ షాక్.. 500 శాతం టారిఫ్‌లు విధించే యోచనలో ట్రంప్?
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో రష్యా నుంచి ఆయిల్ (ముడి చమురు) కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై ఆగ్రహంతో ఉన్న అమెరికా.. ఆయా దేశాల ఉత్పత్తులపై ఏకంగా 500 శాతం టారిఫ్‌లు (500 percent tariffs) విధించేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరించి రష్యాకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయన్న కారణంతో ఈ దేశాలపై కఠిన చర్యలకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం (Republican Senator Lindsey Graham) వెల్లడించారు. రష్యా చమురును కొంటున్న దేశాలపై ఆంక్షలు విధిస్తూ రూపొందించిన ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనుందని ఆయన ప్రకటించారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా పెంచిన సుంకాల వల్ల భారత వస్తువులపై అక్కడ డిమాండ్ తగ్గింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ కారణంగా ఇండియన్ కరెన్సీ విలువ కూడా భారీగా పడిపోయే అవకాశం కనిపిస్తుంది.

Read More..

ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను అనుకరిస్తూ వెటకారం

Next Story