- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ లేకుండానే సభ వాయిదా.. ప్రతిపక్షాల తీరుపై ఫైర్
లోక్‌సభలో స్పీకర్ తొలగింపు తీర్మానంపై వీడని ప్రతిష్టంభన. పశ్చిమాసియా సంక్షోభంపై విపక్షాల ఆందోళనలతో గందరగోళం. చర్చ లేకుండానే సభ రేపటికి వాయిదా.

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్ లోని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla)ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ సమావేశాల (Budget meetings) చివర్లో ఈ పరిణామం చోటు చేసుకొగా.. ఈ రోజు నుంచి రెండో విడత సెషన్స్ ప్రారంభం అయ్యాయి. ప్రతి పక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్.. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం తేలే వరకు ఆ కుర్చీలో కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రెండో సెషన్ ప్రారంభం అయిన ఈ సోమవారం కూడా స్పీకర్ అవిశ్వాసంపై చర్చ సాధ్యపడలేదు.
పశ్చిమాసియా (Middle East) సంక్షోభంపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు (Members of the opposition) సభలో నిరంతరాయంగా ఆందోళనలు చేపట్టారు. పలుమార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైనా, విపక్ష సభ్యుల నినాదాల హోరు తగ్గకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. తనపై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నందున, నిబంధనల ప్రకారం స్పీకర్ ఓం బిర్లా నేడు సభా పీఠంపై కూర్చోలేదు.
సభకు అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్ (Jagadambika Paul) ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తొలగింపు తీర్మానం ఇప్పటికే ఎజెండాలో ఉందని, అయితే ప్రతిపక్షాలు కావాలనే వేరే అంశాలను తెరపైకి తెస్తూ సభను 'బంధీ'గా మార్చాయని వారు ఆరోపించారు. రోజుకు సుమారు 9 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని, విపక్షాల ప్రవర్తన "అపరిపక్వంగా, బాధ్యతారహితంగా" ఉందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాజకీయ ఎజెండా తోనే సభను అడ్డుకుంటున్నారని విమర్శిస్తూ సభను రేపటికి వాయిదా వేశారు.






