- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధంపై చర్చ కోసం లోక్‌సభలో తీవ్ర గందరగోళం.. సభ రేపటికి వాయిదా
దక్షిణాసియా యుద్ధంపై చర్చకు విపక్షాల పట్టుతో లోక్‌సభలో గందరగోళం. చైర్మన్ నిరాకరణతో వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు. సభ రేపటికి వాయిదా.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్ దేశంపై దాడి చేయడంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ (Middle East Countries)లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ (Iran) ప్రతికార దాడులను అరబ్ కంట్రీస్ పై చేయడంతో ప్రపంచ వ్యాప్త వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ యుద్ధం ప్రభావం ప్రస్తుతం భారత బడ్జెట్ సమావేశాల (Budget meetings)పై కూడా పడింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆ పరిస్థితులపై లోక్ సభలో తక్షణ చర్చ చేపట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఈరోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించి, సరిహద్దుల్లో మారుతున్న పరిణామాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, చైర్మన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.
వారితో చైర్మన్ వారించినప్పటికీ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. యుద్ధం వంటి సున్నితమైన అంశంపై చర్చకు వెనుకాడటం సరికాదని, దేశ భద్రత దృష్ట్యా దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సభ్యుల నినాదాలు, తోపులాటల మధ్య సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సభను సజావుగా నడిపించడం సాధ్యం కాదని భావించిన చైర్మన్ లోక్‌సభను రేపటి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.






