అవికా గోర్ పెళ్లిపై హీనా ఖాన్ షాకింగ్ రియాక్షన్.. మిలింద్ నంబర్ వన్ కంజూస్ అంటూ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-22 04:14:18  IST  )

తెలుగు ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’ గా పరిచయం అయి హీరోయిన్‌గా మారి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది అవికా గోర్(Avika Gor).

అవికా గోర్ పెళ్లిపై హీనా ఖాన్ షాకింగ్ రియాక్షన్.. మిలింద్ నంబర్ వన్ కంజూస్ అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’ గా పరిచయం అయి హీరోయిన్‌గా మారి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది అవికా గోర్(Avika Gor). వరుస అవకాశాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. తన ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి ఎక్కడో ప్రైవేట్‌గా కాకుండా, అందరి కళ్ల ముందే నేషనల్ టెలివిజన్‌లో జరగడం విశేషం. గత ఏడాది సెప్టెంబర్ 30, ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే రియాలిటీ షో సెట్స్‌లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు బుల్లితెర స్టార్ నటి హీనా ఖాన్, ఆమె భర్త రాకీ జైస్వాల్ కూడా హాజరయ్యారు. అయితే, ఇటీవల ఎల్విష్ యాదవ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న హీనా ఖాన్(Heena Khan), అవికా గోర్ పెళ్లిపై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘అందరి ముందే కెమెరాల మధ్య పెళ్లి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు, అది చాలా ధైర్యంతో కూడుకున్న పని. పర్సనల్‌గా అయితే మేము అలా అస్సలు చేయలేము’’ అని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో సరదాగా నవ్వుతూ.. ‘‘అయినా మిలింద్ ఒక నంబర్ వన్ కంజూస్ (పిసినారి). టీవీ షోలోనే పెళ్లి కానిచ్చేసి పెళ్లి ఖర్చులన్నీ మిగిల్చేశాడు, బోలెడంత డబ్బు ఆదా చేశాడు’’ అంటూ ఆటపట్టించారు. మరోవైపు నేషనల్ టీవీలో పెళ్లి చేసుకోవడంపై అవికా గోర్ తన మనసులోని మాటను పంచుకుంది. ‘‘నేను 2008 నుంచి కెమెరా ముందే పెరిగాను. నా ఎదుగుదలను చూసి నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నా జీవితంలో అతి ముఖ్యమైన ఈ పెళ్లి వేడుకను కూడా చూడాలని కోరుకున్నాను. అందుకే ఇలా ప్లాన్ చేశాను’’ అని అవికా స్పష్టం చేశారు. ఇక హీనా ఖాన్- రాకీ జైస్వాల్ విషయానికి వస్తే.. వీరిద్దరూ జూన్ 4, 2025న ముంబైలో చాలా సింపుల్‌గా 'స్పెషల్ మ్యారేజ్ యాక్ట్' ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వేర్వేరు మతాలకు చెందిన వీరు ఎటువంటి హడావిడి లేకుండా సన్నిహితుల మధ్య ఒక్కటయ్యారు. మొత్తానికి అవికా గ్రాండ్ టీవీ పెళ్లి, హీనా సింపుల్ మ్యారేజ్.. ఈ రెండు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Read More..

Faria Abdullah: హిందూ అబ్బాయితో ప్రేమలో ఉన్నాను..బిగ్ ట్విస్ట్ ఇస్తూ ఫరియా షాకింగ్ కామెంట్స్

Next Story