- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న హెబ్బా పటేల్ రొమాంటిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebba Patel) ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మారియో’(Mario).

దిశ, సినిమా: టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebba Patel) ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మారియో’(Mario) గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. అనిరుధ్ శ్రీవాత్సవ్(Anirudh Srivastava) హీరోగా, కల్యాణ్ జి గోగన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వెరైటీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ఆసక్తిని రేపింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకుల కోసం ఇప్పుడు ‘మారియో’ డిజిటల్ ఎంట్రీకి రెడీ అయింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోగా, తాజా సమాచారం ప్రకారం.. జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పోస్టర్‌లో హెబ్బా పటేల్ చేతిలో సిగరెట్‌తో ఊర మాస్ లుక్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఆమె నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో ‘మారియో’ ఒక బెస్ట్ ఓటీటీ ఆప్షన్ అని చెప్పొచ్చు.
Read More..






