నో చెప్పడం బలహీనత కాదు.. అదే మహిళల బలం: ఐశ్వర్య రాయ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-22 05:39:23  IST  )

నేటి సమాజంలో అందరి అంచనాలకు తగినట్లుగా ఉండాలనే ఒత్తిడిలో మహిళలు చాలాసార్లు తమ నిజమైన అభిప్రాయాలను పక్కన పెట్టేస్తున్నారు.

నో చెప్పడం బలహీనత కాదు.. అదే మహిళల బలం: ఐశ్వర్య రాయ్
X

దిశ, సినిమా: నేటి సమాజంలో అందరి అంచనాలకు తగినట్లుగా ఉండాలనే ఒత్తిడిలో మహిళలు చాలాసార్లు తమ నిజమైన అభిప్రాయాలను పక్కన పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితిపై ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai)ఒక విలువైన సందేశాన్ని ఇచ్చారు. మహిళలకు ఉన్న గొప్ప బలం వారి స్వరం అని, తమకు నచ్చని విషయాలపై సంకోచం లేకుండా “లేదు” అని చెప్పగలగడమే నిజమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని ఆమె అన్నారు. జీవితంలో మనం సాధించిన విజయాలే కాదు, మనకు ఇష్టం లేని వాటిని ధైర్యంగా తిరస్కరించిన సందర్భాలు కూడా అంతే ముఖ్యమని ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. సమాజం విధించే అంచనాల వల్ల వెనకడుగు వేయకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె మహిళలకు సూచించారు.

ఏదైనా పని మనకు సరిపోకపోయినా లేదా నచ్చకపోయినా స్పష్టంగా “కాదు” అని చెప్పడం వల్ల మనపై మనకున్న నమ్మకం మరింత బలపడుతుందని ఆమె చెప్పారు. మహిళలు ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోవాలని.. అదే మీ అసలైన బలం అని అన్నారు. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, జీవితం మరింత ప్రశాంతంగా మారుతుందని ఆమె వివరించారు. ఇలాంటి అభిప్రాయాలనే మానసిక నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదానికీ ఒప్పుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, పనిభారం అధికమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మనకంటూ స్పష్టమైన పరిమితులు పెట్టుకున్నప్పుడే ఇతరుల నుంచి గౌరవం లభిస్తుందని, అవసరమైన చోట “కాదు” అని చెప్పడం మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా, సంతృప్తిగా మారుస్తుందని ఐశ్వర్య సూచిస్తున్నారు.

Read More..

నేను పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్ దేవగన్ కారణం.. అసలు విషయం బయటపెట్టి షాకిచ్చిన టబు

Next Story