- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండలో భారీ వర్షం.. మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లోను తండర్ స్టోర్మ్
నల్లగొండ జిల్లాలో భారీ వర్షం, వడగళ్ల వాన! రానున్న 2 గంటల్లో ఖమ్మం జిల్లాను తాకనున్న తీవ్ర తుపాను. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: భారీ ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు అకస్మాత్తుగా కురిసిన వర్షం ఊరటను ఇచ్చింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. ఒక్కసారిగా మారిన వాతావరణంతో నల్లగొండలో భారీ వర్షం కురిసింది. అలాగే నకిరేకల్, కట్టంగూర్, కేతెపల్లి మండలాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ఖమ్మం జిల్లా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 2 గంటల్లో సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, తొర్రూర్, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల నుండి అత్యంత ప్రమాదకరమైన తీవ్ర తుపాను (Severe Squall Line) ఖమ్మం వైపు కదులుతుందని హెచ్చరించింది. ఈ తుపాను నేరుగా ఖమ్మం, వైరా, చింతకాని, కొణిజర్ల ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. ఈ సమయంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం, వడగళ్ల వాన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాచ్ అంచనా వేశారు.






