ఈదురు గాలి వాన బీభత్సం.. తడిసిన రైతుల ధాన్యం

by Kodari Anjali |   (  Updated:2026-05-03 12:27:13  IST  )

బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగింది.

ఈదురు గాలి వాన బీభత్సం.. తడిసిన రైతుల ధాన్యం
X

దిశ, బయ్యారం: మండలంలోని నారాయణపురం, మిర్యాల పెంట, కంబాలపల్లి, రామచంద్రపురం గ్రామాలలో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మడం, ఈదురు గాలివాన బీభత్సంతో కల్లంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యం తడిసినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై తడవకుండా పట్టాలు కప్పేందుకు రైతులు ప్రయత్నించగా, గాలి దుమారంతో పట్టాలు లేచిపోయినట్లు తెలిపారు. పూరిగుడిసెంటింగ్ పైకప్పులు లేచిపోయినట్లు, విద్యుత్ స్తంభాలు విరిగినట్లు, తీగలు తెగిపోయినట్లు చెట్లు విరిగిపడినట్లు సమాచారం. గాలివాన బీభత్సంతో రైతులకు అకాల నష్టం వాటిలినట్లు సమాచారం.

నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. రోహిణీ కార్తె నాటికి పరిస్థితేంటో!

Next Story