Hansika: మళ్లీ ఒక్కటైన శింబు-హన్సిక.. ప్రేమ చిగురించిందే!

by Manoj |   (  Updated:2022-07-15 08:55:32  IST  )

Hansika Lauds Hero Simbu At 'Maha' Movie Audio Launch| ఒకప్పుడు ప్రేమలో మునిగి తేలిన శింబు-హన్సిక జంట పెళ్లి వరకు వెళ్లారని ప్రచారం చేసింది కోలీవుడ్ మీడియా. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'వాలు వెట్టై మన్నన్' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా

Hansika Lauds Hero Simbu At Maha Movie Audio Launch
X

దిశ, సినిమా: Hansika Lauds Hero Simbu At 'Maha' Movie Audio Launch| ఒకప్పుడు ప్రేమలో మునిగి తేలిన శింబు-హన్సిక జంట పెళ్లి వరకు వెళ్లారని ప్రచారం చేసింది కోలీవుడ్ మీడియా. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'వాలు వెట్టై మన్నన్' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. ఐదేళ్ల తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఐతే ఆరేళ్ల తర్వాత వీరిద్దరు 'మహా' సినిమాలో కలిసి నటించడం.. ఆడియో లాంచ్ ఈవెంట్‌లో శింబుపై హన్సిక పొగడ్తల వర్షం కురిపించడం చూస్తుంటే మళ్లీ ఒక్కటయ్యారనే ప్రచారం జరుగుతోంది.

కాగా స్టార్ హీరో అయినా సరే రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా.. 'మహా'లో అతిథి పాత్ర చేసిన డియరెస్ట్ ఫ్రెండ్‌కు థాంక్స్ అని చెప్పింది హన్సిక. మొత్తానికి శింబు-హన్సిక ఒక్కటైతే బాగుంటుందంటున్న ఫ్యాన్స్.. ఇలాగే వీరి మధ్య ప్రేమ కొనసాగాలని కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

Next Story