- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
by samatah |
దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మళయాళ నటుడు, చిత్రనిర్మాత ప్రతాప్ పోతేన్ శుక్రవారం ఉదయం (70) కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మళయాళ నటుడు, చిత్రనిర్మాత ప్రతాప్ పోతేన్ శుక్రవారం ఉదయం (70) కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా, ఈయన తెలుగు, తమిళ, మలయాళం, హీందీ సినిమాల్లో నటించారు. ఇక ఆగస్టు 13, 1952లో జన్మించిన అతను 15 సంవత్సరాల చిన్న వయస్సులోనే తన తండ్రి కోలతింకల్ పోతన్‌ను కోల్పోయాడు. ఊటీలోని లారెన్స్ స్కూల్, లవ్‌డేల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. అనంతరం అతను నటి రాధికను వివాహం చేసుకున్నాడు. వారు విడాకులు తీసుకున్నారు. సంవత్సరం తర్వాత అమలా సత్యనాథ్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.
Next Story






