'జన నాయగన్‌'లో మత గొడవలు రేపే సీన్లు : హైకోర్టు

by Muthe.Rajitha |   (  Updated:2026-01-29 04:09:16  IST  )

'జన నాయగన్‌' సినిమాపై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

జన నాయగన్‌లో మత గొడవలు రేపే సీన్లు : హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్ : 'జన నాయగన్‌' సినిమాపై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీ బయటకి వచ్చింది. అందులో ఈ సినిమాలో దేశంలో మత గొడవలు సృష్టించే సీన్లు ఉన్నాయని కోర్టు పేర్కొంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సెన్సార్ బోర్డు ఛైర్మన్ అధికారాలు, బోర్డు వాదనలు పూర్తిగా వినకుండా సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడం సరికాదని పేర్కొంది. అలాగే సినిమాకు యూ/ఏ 16+ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిర్ణయానికి సంబంధించిన ఆధారాలను సినిమా నిర్మాణ సంస్థ కోర్టులో సమర్పించలేదని అభిప్రాయపడింది. సెన్సార్ బోర్డు సమీక్ష కమిటీ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించామని కోర్టు పేర్కొంది.

సినిమాలో దేశ భద్రతకు భంగం కలిగించే కీలక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. మొదట సినిమాను చూసిన కమిటీలో ఆ రంగానికి సంబంధించిన నిపుణులు లేకపోవడంతోనే 9 మంది సభ్యుల రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించామని వివరించింది. అయితే సినిమా బృందానికి కొత్తగా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఇస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అన్ని వాదనలు, విచారణలు పూర్తైన తర్వాత సినిమాను రివైజింగ్ కమిటీకి పంపాలా వద్దా అనే విషయాన్ని సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయించవచ్చని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

MORE NEWS : ఆ హీరోయిన్‌పై రణ్‌బీర్ ప్రశంసల వర్షం

Next Story