ఆ హీరోయిన్‌పై రణ్‌బీర్ ప్రశంసల వర్షం

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-29 04:10:36  IST  )

బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ఇండస్ట్రీలో 30 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ పరిశ్రమ ఆమెను సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆ హీరోయిన్‌పై రణ్‌బీర్ ప్రశంసల వర్షం
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ఇండస్ట్రీలో 30 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ పరిశ్రమ ఆమెను సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్.. ‘రాణీ ముఖర్జీ ‘సావరియా’ చిత్రంలో నాతో కలిసి నటించారు. నేనెంతో కష్టపడి నటించానని నాకు చెప్పి ప్రోత్సహించిన మొదటి వ్యక్తి త‌నే. నాకు, ఆమెకు జ‌రిగిన సంభాష‌ణ‌ను నేను మ‌ర‌చిపోలేను. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఆమె మాట‌లు నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. నేను ఆమె వ‌ర్క్‌ను చాలా ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించాను. ఆమె గ్రేస్‌, ఛార్మ్‌, తెలివితేట‌ల‌కు ముగ్ధుడిన‌య్యాను. రాణీ ముఖర్జీ త‌న 30 ఏళ్ల సినీ ప్ర‌యాణాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌టం నిజంగా అద్భుతం. ఆమె ఎప్పటికీ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా నేను భావిస్తాను. భార‌త‌దేశంలోని గొప్ప న‌టీమ‌ణుల్లో ఆమె ఒక‌రు. మ‌న ఇండ‌స్ట్రీ ఏంటో ఆమె త‌న ప‌నిత‌నంతో నిర్వ‌చించారు. ఆమె ఎంచుకునే సినిమాలు, పాత్ర‌లు ఇప్పుడు స్క్రీన్‌పై మ‌హిళ‌ల‌ను చూపించే విధానాన్ని మార్చాయి’ అని ప్రశంసలు కురిపించాడు.

MORE NEWS : 'జన నాయగన్‌'లో మత గొడవలు రేపే సీన్లు : హైకోర్టు

Next Story