విజయ్ ఓఎస్డీ నియామకంపై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Malleboina Mahesh |   (  Updated:2026-05-13 09:56:31  IST  )

ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జ్యోతిష్కుడిని ఓఎస్‌డీగా నియమించడంపై విపక్షాల ఆగ్రహం. విమర్శలు వెల్లువెత్తడంతో గంటల వ్యవధిలోనే ఆ నియామకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.

విజయ్ ఓఎస్డీ నియామకంపై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, నాటకీయ పరిణామాల అనంతరం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనకు మొదటి నుంచి మద్దతుగా నిలిచిన తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ (Radhan Pandit Vetrivel)ను ఓఎస్‌డీ (OSD)గా నియమించారు. కాగా ఈ వ్యవహారంపై వీసీకే నేత వన్నియరసు పాటు డీఎండీకే నేత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం జ్యోతిష్యానికి కాకుండా శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.

డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్ కాంత్.. ‘యువత మీకు ఓటు వేసి గెలిపించారు. కానీ మీరు జ్యోతిష్యులను నమ్ముతున్నారు. ఓఎస్డీగా నియమించడానికి కారణం ఏంటి..? ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని ఆమె చురకలు అంటించారు. ఈ విమర్శల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్షను నెగ్గిన విజయ్ ప్రభుత్వం కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు రద్దు చేసింది.

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు!

Next Story