- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు!
తమిళనాడు అసెంబ్లీ బలపరీక్షలో 144 మంది మద్దతుతో గెలిచిన విజయ్ ప్రభుత్వం. టీవీకేకు ఒంటరిగా గెలిచే శక్తి లేదంటూ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు.

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం, ప్రభుత్వ ఏర్పాటుకు అనేక అవాంతరాల తర్వాత సీఎంగా విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నేడు తమిళనాడు అసెంబ్లీలో (Tamil Nadu Assembly) విజయ్ ప్రభుత్వానికి స్పీకర్ బల పరీక్ష (Floor Test) నిర్వహించగా.. విజయ్ ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని, 65 శాతం మంది ఓటర్లు విజయ్‌ను తిరస్కరించారని, టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ప్రజలు ఓటేశారని అన్నారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే కూటమిలోని పార్టీలే మద్దతిస్తున్నాయి అన్నది మర్చిపోవద్దని గుర్తు చేశారు. అలాగే టీవీకే అధినేత అయినప్పటికి గెలుపుపై నమ్మకం లేకపోవడం వల్లనే విజయ్ రెండు చోట్ల పోటీ చేశారని, ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదని ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే విజయ్ ప్రభుత్వ బలపరీక్ష వెళ తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ ఓట్ల లెక్కింపు ద్వారా ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేపట్టారు. విజయ్‌కు సపోర్ట్‌గా లేచి నిలబడిన ఎమ్మెల్యేలు.. మద్దతిచ్చిన వారి పేర్లను అసెంబ్లీ అధికారులు చదివి వినిపించారు. అంతకు ముందు డీఎంకే, ఏఐడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా.. ఏఐడీఎంకే రేబల్ వర్గం.. టీవీకే ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచారు. దీంతో బలపరీక్షలో విజయకి 144 మంది సభ్యులు మద్దతుగా నిలిచినట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే మరో 22 మంది విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినప్పటికి బలపరీక్ష (Floor Test)లో విజయ్ ప్రభుత్వం నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు.






