పండగ వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్: హైదరాబాద్ - విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-10 09:52:46  IST  )

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

పండగ వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్: హైదరాబాద్ - విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railways) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ (Hyderbad - Vijayawada) మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు 10 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా ప్రకటించింది. సాధారణంగా పండుగ సమయాల్లో రెగ్యులర్ రైళ్లన్నీ నెలల ముందే నిండిపోవడంతో, సొంతూళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామంతో తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణికులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ నెల 11, 12, 13, 18, 19వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని.. ఇవి ప్రతిరోజూ ఉదయం 6:10 గంటలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కోసం ఈ నెల 10, 11, 12, 17, 19వ తేదీల్లో మధ్యాహ్నం 2:40 గంటలకు విజయవాడ నుంచి ట్రైన్లు బయలుదేరుతాయని సౌత్ సెంట్రల్ రైల్వేస్ అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఈ ప్రత్యేక రైళ్లలో కేవలం రిజర్వేషన్ ఉన్నవారే కాకుండా, సాధారణ ప్రయాణికులకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. కాగా, ఈ ట్రైన్లలో ఛైర్ కార్, జనరల్ బోగీలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

READ MORE .....

పల్లెకు పోదాం చలో చలో.. నందిగామ వైజంక్షన్‌ వద్ద భారీగా వాహనాల రద్దీ

Next Story