- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ గుడికి గంభీర్, సూర్యకుమార్
టీ20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గంభీర్, జై షా ట్రోఫీతో సహా ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : టీ20 మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న కొద్ది గంటల్లోనే ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ కార్యదర్శి జై షా కలిసి అహ్మదాబాద్‌లోని ప్రముఖ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. సూర్యకుమార్ యాదవ్ తన చేతులతో టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని ఆలయంలోని హనుమంతుడి విగ్రహం ముందుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దేశానికి గర్వకారణమైన ఈ విజయాన్ని దేవుడి పాదాల దగ్గర ఉంచి మొక్కులు చెల్లించుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టుకు ఇది మొదటి మేజర్ ఐసీసీ ట్రోఫీ కావడంతో గంభీర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల గంభీర్ పై వస్తున్న విమర్శలే ఇందుకు కారణం. కాగా ఈ సందర్భంగా పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసారు.






