బీజేపీలోకి మాజీ MP విజయసాయిరెడ్డి!

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-22 14:58:52  IST  )

ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు.

బీజేపీలోకి మాజీ MP విజయసాయిరెడ్డి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. గురువారం లిక్కర్‌ స్కాం కేసులో విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. తాజాగా విచారణ ముగియడంతో విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. గతంలో జగన్ 20 ఏళ్లు అధికారంలో ఉంటానని అనుకున్నాడు.. ఇప్పుడు చంద్రబాబు 25 ఏళ్లు ఉంటానని అనుకుంటున్నాడు.. ఇదంతా భ్రమే అని విజయసాయిరెడ్డి విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి తనను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి నేను ఇంకా పూర్తిగా తప్పుకోలేదు.. ఈనెల 25వ తేదీన నుంచి పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను అని సంచలన ప్రకటన చేశారు. బీజేపీ ఆహ్వానిస్తే ఆలోచిస్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు. అంతేకాదు.. మోడీ ఉత్తమ ప్రధాని అని, ప్రపంచ దేశాల ముందు భారత్‌ను గర్వంగా నిలబెడుతున్నారని కొనియాడారు. దేశానికి ఇలాంటి ప్రధాని ఉండటం ప్రజల అదృష్టం అని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ మళ్లీ అధికారంలోకి రారు

కోటరీ వ్యవస్థ ఇలాగే కొనసాగితే జగన్ మళ్లీ అధికారంలోకి రారు.. కూటమిని విడగొడితేనే జగన్‌కు మళ్లీ అధికారం.. నేను జగన్‌ను విమర్శించలేదు, ఆయనే నన్ను విమర్శించారు.. నేను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారు.. ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి.. జగన్‌కు తెలియకుండా పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయి.. కొన్ని పందికొక్కులు జగన్‌ను మిస్ లీడ్ చేస్తున్నాయి. వాటిని ఎన్నాళ్లు నమ్మితే.. అన్నాళ్లు వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంటుందని విజయ సాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Read More : మిథున్ రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించా: విజయసాయిరెడ్డి

Next Story