మిథున్ రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించా: విజయసాయిరెడ్డి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-22 14:52:52  IST  )

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు...

మిథున్ రెడ్డి సూచన మేరకే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించా: విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Ycp Mp Midhun Reddy) సూచన మేరకే అరబిందో(Aurobindo) నుంచి డబ్బులు ఇప్పించానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former Mp Vijayasai Reddy) అన్నారు. లిక్కర్ కేసులో ఈడీ విచారించిన నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)తో మీటింగ్ ఏర్పాటు చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు. సజ్జల శ్రీధర్ రెడ్డి(Sajjala Sridhar Reddy), కసిరెడ్డి, మిథున్ రెడ్డి మధ్యే లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. లిక్కర్ స్కామ్‌(Liquor Scam)పై రాజ్ కసిరెడ్డికే తెలుసునని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కోటరీలో ఉన్న పందికొక్కులే జగన్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. చాలా తప్పులు జరియని, కానీ జగన్ కు తెలిదని తెలిపారు. ఇలాగే కొనసాగితే పార్టీ ఘోరంగా దెబ్బ తింటోందన్నారు. కోటరీలో ఎవరున్నారో నాయకులందరికీ తెలుసన్నారు. పందికొక్కులు ఎవరో తన నోటితో తాను చెప్పాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.

నేను రాజకీయాల నుండి తప్పుకోలేదు.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

Next Story