అది యువ సంగ్రామ స‌ద‌స్సు కాదు.. యువ‌త‌ను రెచ్చగొట్టే స‌ద‌స్సు: ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ నిర్వహించింది యువ సంగ్రామ స‌ద‌స్సు కాదని, యువ‌త‌ను రెచ్చగొట్టే స‌ద‌స్సు అని ప్రభుత్వి విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

అది యువ సంగ్రామ స‌ద‌స్సు కాదు.. యువ‌త‌ను రెచ్చగొట్టే స‌ద‌స్సు: ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నిర్వహించింది యువ సంగ్రామ స‌ద‌స్సు కాదని, యువ‌త‌ను రెచ్చగొట్టే స‌ద‌స్సు అని ప్రభుత్వి విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ స‌భ‌లో రెచ్చగొట్టేలా ఉన్మాదంగా వికృత వ్యాఖ్యలు చేశారని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎండ్రిన్ తాగి చావాల‌ని, ఎమ్మెల్యేల‌ను కొట్టి చంపాల‌ని మాట్లాడారు, పింక్ సోష‌ల్ మీడియా ఫెయిడ్ ఆర్టిస్టులు వికృతంగా మాట్లాడుతుంటే కేటీఆర్ వాళ్లను వారించ‌కుండా చూస్తు కూర్చున్నాడని ఆది శ్రీనివాస్ ఆక్షేపించారు. కేటీఆర్ మ‌న‌స్థత్వం ఏమిటో దీన్ని చూసి అర్థం చేసుకోవ‌చ్చుని, మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్న ఆలోచ‌న‌తో విష సంస్కృతిని, విష బీజాల‌ను నాటే ప్రయ‌త్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

నిరుద్యోగుల‌ను అడ్డం పెట్టుకున్ని రాజ‌కీయాలు చేస్తున్నారని, తమ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసింది..పేప‌ర్ లీక్ లు లేకుండా ప‌క‌డ్బందీగా పరీక్షలు నిర్వహించి నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేశామని ఆది శ్రీనివాస్ తెలిపారు. అంగ‌న్ వాడీ, పోలీస్ శాఖ‌తో పాటు అనేక‌ ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఇచ్చామని, భ‌విష్యత్తులో మ‌రిన్ని ఇస్తామన్నారు. రాజ‌కీయ ఉనికి కాపాడుకోవ‌డం కోస‌మే కేటీఆర్ డ్రామాలు అని, పేప‌ర్లు లీక్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది.. నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని ఇవ్వకుండా మోసం చేసిన చ‌రిత్ర కేసీఆర్ దని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. గులాబీ ఫెయిడ్ ఆరిస్టుల‌తో స‌భ‌ను నింపారని, సోష‌ల్ మీడియాలో వికృత మాట‌ల‌ను ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.

Next Story