'రౌడీ జనార్ధన' ఆ రెండు సన్నివేశాలకు స్క్రీన్ చిరిగిపోవాల్సిందే

by Pulgam srinivas |

'రౌడీ జనార్ధన' ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకే ప్రధాన బలంగా నిలవనున్నాయనే టాక్ వినిపిస్తోంది.

రౌడీ జనార్ధన ఆ రెండు సన్నివేశాలకు స్క్రీన్ చిరిగిపోవాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రౌడీ జనార్ధన' అనే పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనుండగా, రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్టో జేవియర్, విశాల్ మిశ్రా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం, ఈ సినిమాలోని ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించే స్థాయిలో ఉండబోతున్నాయట. ముఖ్యంగా అప్పటివరకు సాగిన సినిమా ప్రభావం మొత్తం ప్రీ-క్లైమాక్స్ నుంచి మరో స్థాయికి చేరుకుని, క్లైమాక్స్ వరకు పీక్ లెవల్‌లో కొనసాగుతుందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోవడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

Next Story