- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను రాజకీయాల నుండి తప్పుకోలేదు.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన
ఈడీ విచారణ తరవాత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ గురించి తనకు తెలియదని ఆ విషయాన్ని ఈడీకి చెప్పానన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఈడీ విచారణ తరవాత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ గురించి తనకు తెలియదని ఆ విషయాన్ని ఈడీకి చెప్పానన్నారు. వైసీపీలో మీది నెంబర్ 2 స్థానం మీకెందుకు తెలియదని ప్రశ్నించారని అన్నారు. దానికి స్వయానా జగన్ పార్టీలో నంబర్ 2 స్థానం చెప్పారని ఆ విషయాన్ని వారికి తెలిపానని అన్నారు. తనను ఎప్పుడూ నెంబర్ 2 స్థానంలో చూడలేదని కానీ మీడియా, వైసీపీ సోషల్ మీడియా పదే పదే ఇప్పుడు నంబర్ 2 స్థానంలో ఉన్నానని ప్రచారం చేస్తోందన్నారు. కేసుల విషయంలో అయితే నంబర్ 2 లాభాల్లో అయితే వంద స్థానాల వరకు కూడా ఉండనని అన్నారు.
2018 వరకు తాను జగన్ మనసులో నంబర్ 2 స్థానంలో ఉన్నానని కానీ అధికారంలోకి వచ్చాక కోటరీ కారణంగా సైడ్ అవుతూ వచ్చానని అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు తాను జగన్ ను వెన్నుపోటు పొడుస్తానని ఆయనలో అభద్రతా భావాన్ని కల్పించారన్నారు. కూటమి విడిపోతేనే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని అన్నారు. రాజకీయాల నుండి నేను ఇంకా తప్పుకోలేదని వ్యాఖ్యానించారు.
ఈ నెల 25 తరవాత రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా మోడీ ఉత్తమ ప్రధాని అని కొనియాడారు. ఆహ్వానం అందితే బీజేపీలోకి వెళ్లేందుకు ఆలోచిస్తానని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుష్ట ప్రభుత్వం అని తనకు సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తోందని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని జగన్ కూడా 20 ఏళ్లు అధికారంలో ఉంటానని అనుకున్నారని చెప్పారు. చంద్రబాబు కూడా 25ఏళ్లు అధికారంలో ఉంటానని అనుకుంటున్నారని చెప్పారు. కూటమి ఇలానే ఉంటే జగన్ అధికారంలోకి రారు అంటూ వ్యాఖ్యానించారు.
READ MORE ....






