- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: విజయసాయిరెడ్డికి ముగిసిన ఈడీ విచారణ
ఏపీ మద్యం స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ విచారణ ముగిసింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం స్కామ్ కేసు(Ap Liquor Scam Case)లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former Mp VijayasaiReddy)ని ఈడీ అధికారులు(Enforment Officers) గురువారం ఉదయం నుంచి విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణ సాయంత్రానికి ముగిసింది. దీంతో విజయసాయిరెడ్డి ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ప్రధానంగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం విక్రయాలు, మద్యం పాలసీ, నిధుల మళ్లింపు, అవకతవకలు, సూత్రదారులెవరు, లావాదేవీలు ఎలా జరిగాయనే కోణంలోనే ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి రావాలని అధికారులు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఆయన ఈ ఉదయం నుంచి విచారణకు హాజరయ్యారు. ఈడీ అడిగిన పలు ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానాలిచ్చినట్లు సమాచారం. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
READ MORE ....






