- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case: సిట్ విచారణకు హాజరైన సంతోష్ రావు.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!
బీఆర్ఎస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు(Santosh Rao) సిట్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నందినగర్ నివాసం నుంచి పలువురు నేతలతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. 3 గంటలకు ఆయన విచారణ ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్(Phone Tapping Case) చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులను అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారం చేరవేయడంలో సంతోష్ రావు పాత్రపై ఆరా తీసేందుకు ఈ నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన మరియు అధికార దుర్వినియోగం ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్, హరీష్‌రావులను కూడా అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా సంతోష్ రావును విచారించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
READ MORE ....






