- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: బొగ్గు స్కామ్‍పై సమగ్ర దర్యాప్తు జరిపించండి.. గవర్నర్‍కు బీఆర్ఎస్ ఫిర్యాదు
కోల్ కుంభకోణాన్ని బట్టబయలు చేశాక పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణిలో బొగ్గు స్కామ్ జరిగిందని ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను బీఆర్ఎస్ నేతలు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం ఇవాళ లోక్ భవన్‍లో గవర్నర్‍ను కలిసి సింగరేణిలో బొగ్గుస్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్‍కు సంబంధించిన వివరాలను గవర్నర్‍కు అందజేశారు. అనంతరం లోక్ భవన్ బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ. 10 కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేశారని ఇప్పటికే ప్రజలతో ఆడుకుంటున్న సీఎం.. సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ లో వణుకు మొదలైంది:
సీఎం అంటే కోల్ మాఫీయాకు నాయకుడిగా భావించే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా భయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్‍లో వణుకు మొదలైందని ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశాక పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని విమర్శించారు. ఆధారాలతో కుంభకోణాలు బయటపెట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో పారదర్శకతకు పాతరేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి టెండర్లలో నిబంధనలు పెట్టారని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట ఒక్కొక్కరిని పిలుస్తున్నారన్నారు.
READ MORE ....
Next Story






