- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైర్ సిబ్బందికి విదేశాల్లో శిక్షణ ఇప్పించాలి.. నాంపల్లి ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు
నాంపల్లి ఫర్నిచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం శనివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా.. ఇప్పటికి మంటలు అదుపులోకి రాలేదు.

దిశ, వెబ్ డెస్క్: నాంపల్లి ఫర్నిచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive fire) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం శనివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా.. ఇప్పటికి మంటలు అదుపులోకి రాలేదు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎడుగురు భవనంలోనే చిక్కుకున్నారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh.).. సంఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగి 22 గంటలు గడుస్తున్నా, భవనంలో చిక్కుకున్న ఆరుగురిని కాపాడలేక పోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాణ నష్టం జరగకుండా బాధితులను ఎలా రక్షించాలనే అంశంపై మన అగ్నిమాపక సిబ్బందికి అత్యాధునిక శిక్షణ అవసరమని ఎమ్మెల్యే రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని, ఫైర్ సిబ్బందిని విదేశాలకు పంపి మెరుగైన శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో, లోపల చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులు క్షేమంగా తిరిగి రావాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రాజా సింగ్ తెలిపారు.
రెస్క్యూ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన శిక్షణ తోడైతే మరిన్ని ప్రాణాలను కాపాడవచ్చని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే ఉదయం 9 గంటల తర్వాత మంటలు కాస్త తగ్గడంతో అండర్ గ్రౌండ్ బేస్మెంట్ కు నాలుగు వైపుల రంద్రాలు చేశారు. అనంతరం రెండు మృతదేహానలు రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.
Read More...
Nampally Fire: అంతులేని విషాదం.. నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు






